దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జూన్, జులై నెలల్లో పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
జూన్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించారు. జూన్ 9న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు కల్పించారు. పోలింగ్ ముగిసిన రోజే సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. జూన్ 20 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న Pilli Subhash Chandra Bose, Alla Ayodhya Rami Reddy, Parimal Nathwani, Sana Satish పదవీకాలం జూన్ 26తో ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















