Anthropic సహ వ్యవస్థాపకుడు Jack Clark కృత్రిమ మేధ (AI) భవిష్యత్తుపై కీలక హెచ్చరికలు చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రపంచం అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభాలు తప్పవని అన్నారు. ఏఐకి సిద్ధం కాకపోవడం అంటే కొవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడం లాంటిదేనని వ్యాఖ్యానించారు.
University of Oxford లో జరిగిన ఉపన్యాసంలో మాట్లాడిన జాక్ క్లార్క్, మానవులను మించే సామర్థ్యాలు కలిగిన ఈ సాంకేతికతపై నియంత్రణ లేకపోతే మానవాళికే ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కృత్రిమ మేధ తన సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటూ పోతుంటే చివరకు మనుషులు స్పందించాల్సిన అత్యవసర పరిస్థితి వస్తుందని అన్నారు.
ఏఐ అభివృద్ధిని కొంత నెమ్మదింపజేయడం మానవ సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్న ఆయన.. ప్రస్తుతం ప్రపంచ దేశాలు, టెక్ కంపెనీలు ఒకదానిపై మరొకటి ఆధిపత్యం సాధించేందుకు పోటీ పడుతున్నందున అది సాధ్యమవడం కష్టమని అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై ఇటీవల Dario Amodei కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ది అడాలసెన్స్ ఆఫ్ టెక్నాలజీ’ పేరుతో విడుదల చేసిన వ్యాసంలో ఏఐ భవిష్యత్తు, దాని వల్ల కలిగే ముప్పులు, అవసరమైన జాగ్రత్తలపై విశ్లేషించారు. అత్యంత శక్తివంతమైన టెక్నాలజీని మానవజాతి చేతుల్లోకి తెచ్చే దశలో ఉన్నామని, దాన్ని సమర్థంగా నియంత్రించే సామాజిక, రాజకీయ పరిపక్వత ప్రపంచానికి ఉందా అనే ప్రశ్న తలెత్తుతోందని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















