విజయ్ శంకర్ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ తన క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు. 35 ఏళ్ల తమిళనాడు ఆల్‌రౌండర్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాడు.
“పదేళ్ల వయసులో క్రికెట్‌ను ప్రారంభించాను. అన్ని స్థాయిల్లో ఆడాను. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. ఇప్పుడు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. కొత్త అవకాశాల కోసం ముందుకు సాగుతున్నాను” అని విజయ్ శంకర్ పేర్కొన్నాడు.
విజయ్ శంకర్ 2018లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అతను 12 వన్డేలు, 9 టీ20లు ఆడి వన్డేల్లో 223 పరుగులు చేసి 4 వికెట్లు తీశాడు. టీ20ల్లో 101 పరుగులు చేసి 5 వికెట్లు సాధించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ అతని చివరి అంతర్జాతీయ ప్రదర్శనగా నిలిచింది.
ఐపీఎల్‌లో విజయ్ శంకర్ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. Chennai Super Kings, Sunrisers Hyderabad, Delhi Capitals, Gujarat Titans తరఫున ఆడాడు. 2025 సీజన్‌లో చివరిగా సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
మొత్తం 78 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1233 పరుగులు, 9 వికెట్లు సాధించిన ఆయన, దేశవాళీ క్రికెట్‌లో కూడా తమిళనాడు తరఫున ఎన్నో సంవత్సరాలు కీలక పాత్ర పోషించాడు. చివరి సీజన్‌లో త్రిపుర జట్టుకు ఆడిన విజయ్ శంకర్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 77 మ్యాచ్‌ల్లో 4253 పరుగులు, 43 వికెట్లు సాధించాడు.
ఇలా అన్ని ఫార్మాట్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన విజయ్ శంకర్ క్రికెట్ ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















