నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana) అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ధీమా వ్యక్తం చేశారు. హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్‌తో కలిసి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలు, హన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేయడం గురించి రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇది నా కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రాలలో ఒకటి. కేవలం కథ పరంగానే కాదు, అన్నివిధాలా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతికత ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ట్రైలర్‌ను త్రీడీలో చూశాను, అద్భుతంగా ఉంది. భారత్‌లోనే కాదు, గ్లోబల్ స్థాయిలో ఇలాంటి విజువల్ అనుభవం ఇప్పటివరకు చూడలేదు. త్రీడీ విజువల్స్, సంగీతం ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి’’ అని ఆయన అన్నారు.
హన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ రెహమాన్ ఇలా పేర్కొన్నారు: ‘‘మాది చాలా మంచి స్నేహం. మన దేశం, సంస్కృతికి సంబంధించిన గొప్ప చిత్రానికి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. హన్స్ జిమ్మర్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావడం అంటే ఆయన్ను ప్రపంచ వేదికపై ఒక రాయబారిగా నిలబెట్టినట్లే. ఆయన వల్ల అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తారు. ఒక భారతీయ సినిమాకు ఆయన ఏ రకమైన సంగీతాన్ని అందించారో చూడాలనే కుతూహలంతోనే విదేశీయులు థియేటర్లకు వస్తారు. ఆయనది ప్రత్యేకమైన సంగీత శైలి. అలాంటి గొప్ప కళాకారుడితో పని చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నా. ఇది భారతదేశపు అత్యంత అద్భుతమైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది’’ అని రెహమాన్ తెలిపారు.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మొదటి భాగం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















