టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు, ఆటపై ఆసక్తి తగ్గిపోవడమే తన నిర్ణయానికి ప్రధాన కారణమని యువరాజ్ తాజాగా వెల్లడించాడు.
ఓ పాడ్‌కాస్ట్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో మాట్లాడుతూ.. “నా ఆటను నేను ఆస్వాదించలేకపోయాను. అలాగే నాకు తగిన మద్దతు, గౌరవం లభించలేదన్న భావన కలిగింది. అలాంటప్పుడు ఇంకా ఎందుకు క్రికెట్ ఆడాలి అనిపించింది. మానసికంగా, శారీరకంగా నా నుంచి ఇక ఎక్కువ ఆశించలేనని భావించాను. అందుకే క్రికెట్‌కు వీడ్కోలు పలికాను” అని యువరాజ్ చెప్పాడు.
యువరాజ్ సింగ్ తన కెరీర్‌లో 40 టెస్టుల్లో 1,900 పరుగులు (3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు), 304 వన్డేల్లో 8,701 పరుగులు (14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు), 58 టీ20ల్లో 1,177 పరుగులు (8 హాఫ్ సెంచరీలు) సాధించాడు. ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌ల్లో 2,750 పరుగులు చేసి 13 అర్ధశతకాలు నమోదు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















