అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన అత్యంత ప్రాసెస్ చేసిన జంక్‌ఫుడ్ వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో జంక్‌ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. అలాగే పిల్లలు, పసిపిల్లలను లక్ష్యంగా చేసుకుని పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్‌పై కూడా కఠిన ఆంక్షలు అవసరమని సూచించింది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో బర్గర్, పిజ్జా, నూడుల్స్, సాఫ్ట్‌డ్రింక్స్ వంటి అల్ట్రా ప్రాసెస్‌డ్ ఆహారాల వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని హెచ్చరించింది.
గణాంకాల ప్రకారం 2009 నుంచి 2023 మధ్య జంక్‌ఫుడ్ వినియోగం 150 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. అలాగే ఈ తరహా ఆహార పదార్థాల మార్కెట్ విలువ 2006లో 0.9 బిలియన్ డాలర్ల నుంచి 2019 నాటికి 38 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో మహిళలు, పురుషుల్లో ఊబకాయం సమస్య దాదాపు రెండింతలు కావడం ఆందోళన కలిగించే అంశమని సర్వే పేర్కొంది.
ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలంటే కేవలం వ్యక్తిగత అలవాట్లు మారడం సరిపోదని, ఆహార వ్యవస్థలపై పాలనపరమైన విధానాల్లోనూ మార్పులు అవసరమని సర్వే స్పష్టం చేసింది. జంక్‌ఫుడ్ ఉత్పత్తి, ప్రచారాన్ని నియంత్రించడంతో పాటు, ప్రతి ఉత్పత్తిపై ఎంత కొవ్వు, చక్కెర, ఉప్పు ఉపయోగించారో స్పష్టంగా చూపే న్యూట్రిషన్ లేబుల్స్‌ను తప్పనిసరిగా ముద్రించాలని ఆర్థిక సర్వే సూచించింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















