రాజధాని అమరావతి రైతులు, మహిళలు తమ ఆరాధ్య దైవం విజయవాడ కనకదుర్గమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిర్వహించిన పాదయాత్ర భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా సాగింది. అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించడం, రాజధాని పనుల్లో వేగం పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ మొక్కుబడి యాత్రను చేపట్టారు.
మంగళగిరి మండలం సీతానగరం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా ఇంద్రకీలాద్రి వరకు కొనసాగింది. వందలాది మంది మహిళలు, రైతులు సాంప్రదాయ దుస్తుల్లో, మంగళవాయిద్యాల నడుమ నడుచుకుంటూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె, పసుపు-కుంకుమలను సమర్పించారు. ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తమ కల సాకారం కాబోతోందన్న ఆనందం ప్రతి ఒక్కరి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. దారిపొడవునా జై అమరావతి నినాదాలతో కృష్ణాతీరం మార్మోగింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketNews Crime Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

















