ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌కు కీలకమైన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-02) విజయవంతంగా పూర్తైంది. శుక్రవారం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. సుమారు 5.7 టన్నుల బరువు గల నమూనా క్రూ మాడ్యూల్‌ను భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, నిర్దేశిత సముద్ర ప్రాంతంలో విజయవంతంగా విడిచారు.
అనంతరం భారత నౌకాదళం సమన్వయంతో ఆ క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అంతరిక్ష ప్రయాణం అనంతరం వ్యోమగాములు భూమిపై సురక్షితంగా ల్యాండింగ్ కావడానికి ఈ విధానం అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.IADT-02 విజయంపై Indian Space Research Organisation శాస్త్రవేత్తల బృందాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి Jitendra Singh ‘X’ వేదికగా అభినందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















