క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ R. Praggnanandhaa ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ, టైటిల్ గెలిచే అవకాశాలు తగ్గినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అయితే మహిళల విభాగంలో అతని సోదరి R. Vaishali అద్భుత ప్రదర్శనతో టైటిల్ రేసులో ముందంజలో నిలిచింది.
10 రౌండ్లు ముగిసే సరికి వైశాలి 3 విజయాలు, 6 డ్రాలతో మొత్తం 6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్క గేమ్‌లో మాత్రమే ఓడిన ఆమె, మిగిలిన నాలుగు రౌండ్లలో జోరును కొనసాగించి టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తదుపరి రౌండ్లలో వైశాలి అలెగ్జాండ్రా (రష్యా), జు జినర్ (చైనా), టాన్ జోంగ్‌యి (చైనా), కేథరీనా (రష్యా)లతో తలపడనుంది. ఆమెకు జు జినర్ (5.5 పాయింట్లు), అనా ముజ్‌చుక్ (5.5 పాయింట్లు) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అలెగ్జాండ్రా, బిబిసారా (కజకిస్థాన్), కేథరీనా కూడా 5 పాయింట్లతో రేసులో ఉన్నారు.ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ 4.5 పాయింట్లతో వెనుకంజలో ఉంది. ఓపెన్ విభాగంలో జవోకిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్థాన్) 8 పాయింట్లతో ఆధిపత్యం కొనసాగిస్తూ టైటిల్‌కు దగ్గరగా ఉన్నాడు. అనీష్ గిరి (నెదర్లాండ్స్) 6 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















