నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “తీరం మనదే.. బోటు మనదే.. వేటా మనదే.. రాజీలేదు” అంటూ మత్స్యకారుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన బోట్ల చొరబాటును అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని, బోటు సరిహద్దులు దాటగానే అధికారులకు వెంటనే సమాచారం అందే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసా అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించగా, ఈసారి 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయం నేరుగా ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మత్స్య సంపద అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని, దేశవ్యాప్తంగా ఎగుమతి అయ్యే రొయ్యల్లో 80 శాతం ఏపీ నుంచే ప్రపంచ మార్కెట్‌కు వెళ్తున్నాయని వివరించారు.
అలాగే సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేస్తే మహిళలకు మంచి ఆదాయం వస్తుందని సీఎం సూచించారు. మగవాళ్లు వేటకు వెళ్తే మహిళలు సీవీడ్ సాగు ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయాలని కోరారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడం, వారి ఆదాయం పెంచడం, ఆధునిక సదుపాయాలు కల్పించడం ఈ ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















