ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయా దేశాల నేతలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలు, హస్తకళల వైభవాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కానుకలను అందించారు.
ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మ్యాటరెల్లాకు తెల్లని పాలరాయితో రూపొందించిన అద్భుతమైన మార్బుల్ ఇన్‌లే వర్క్ బాక్స్‌ను ప్రధాని మోదీ బహుకరించారు. అందులో భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజాలు పండిట్ భీమ్‌సేన్ జోషి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గానాల సీడీలు ఉన్నాయి. ఈ పెట్టెపై లాపిస్ లాజులి, టర్కోయిస్, మాలకైట్, పగడం వంటి విలువైన రాళ్లతో అలంకరణ చేశారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అస్సాంలో ప్రసిద్ధి చెందిన “గోల్డెన్ సిల్క్” ముగా శాలువాతో పాటు మణిపూర్‌కు చెందిన శిరుయ్ లిలీ సిల్క్ స్కార్ఫ్‌ను అందించారు.యూఏఈ యువరాజుకు బిహార్ మిథిలా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మఖానా, యూఏఈ రాణికి తెలంగాణ కరీంనగర్‌కు చెందిన ఫిలిగ్రీ పెట్టె, మహారాష్ట్ర పట్టు వస్త్రాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు.యూఏఈ అధ్యక్షుడికి గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన రోగన్ పెయింటింగ్, కేసరీ మామిడిపండ్లు, మేఘాలయ పైనాపిల్‌లను బహుకరించారు.
నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, స్వీడన్ నేతలకు కూడా భారతీయ సంప్రదాయ కళలు, చిత్రపటాలు, హస్తకళా ఉత్పత్తులు అందించి భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటారు.భారతీయ కళలు, సంస్కృతి, హస్తకళలను ప్రపంచ నేతలకు పరిచయం చేస్తూ “సాఫ్ట్ డిప్లమసీ”లో మోదీ మరోసారి ప్రత్యేకత చాటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















