తెలంగాణను దేశంలోనే అతిపెద్ద డేటా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ, జీసీసీ (Global Capability Centers) అవకాశాలను జిల్లాల వరకూ విస్తరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు వెల్లడించారు. రాష్ట్రంలో 1,500 ఎకరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో భారీ “డేటా సిటీ” ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.జీసీసీలు, డేటా సెంటర్ల ఏర్పాటుకు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ-హైదరాబాద్ హైవే వెంట ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ భూములను గుర్తించాలని తెలిపారు.
అలాగే “ఇన్వెస్ట్ తెలంగాణ” పేరుతో పెట్టుబడిదారులకు ప్రత్యేక సేవల సంస్థను ఏర్పాటు చేయాలని సీఎం ప్రకటించారు. అన్ని అనుమతులు, సేవలు ఒకే వేదికపై అందేలా ప్రత్యేక ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకురావాలని సూచించారు.భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్‌జీరో విధానాలు అమలు చేస్తూ AI City, Health City, Industrial Corridor వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ స్థాయి నగరాల నమూనాలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసు అధికారులు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాలు కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.రానున్న మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరి చేయాలని కూడా సీఎం ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















