Honda Cars India తన పాపులర్ సెడాన్ కార్ ‘హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్’ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధరను రూ.11.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది.
మిడ్‌సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో ఈ కారు Volkswagen Virtus, Skoda Slavia, Hyundai Vernaలకు గట్టి పోటీ ఇవ్వనుంది.కొత్త హోండా సిటీలో హనీకూంబ్ స్టైల్ ఫ్రంట్ గ్రిల్, లైట్ స్ట్రిప్‌తో ఆకట్టుకునే డిజైన్‌ను అందించారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు Android Auto, Apple CarPlay సపోర్ట్ ఉన్నాయి.
ఇందులో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, 8 స్పీకర్ ఆడియో సిస్టమ్, యాంబియెంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు అందించారు. భద్రత కోసం 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ADAS ఫీచర్లు కూడా ఉన్నాయి.1.5 లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 121hp పవర్, 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.ఇదిలా ఉండగా, Honda 2030 నాటికి భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్, కాంపాక్ట్ SUVలతో సహా 10 కొత్త మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















