ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు నెలలుగా సంచరిస్తున్న పెద్దపులి మళ్లీ దాడులు చేయడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాత్రి వేళల్లో పశువులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ పులి ప్రస్తుతం పోలవరం ప్రాంతంలో తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పెద్దపులి తాజాగా గంగవరం మండలం వైపు ప్రవేశించినట్లు సమాచారం. ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో కూడా ఇది సంచరించినట్లు గుర్తించారు. గతంలో పులిని పట్టుకునే సమయంలో దాని మెడకు రేడియో కాలర్ అమర్చినందున దాని కదలికలను అధికారులు నిరంతరం ట్రాక్ చేస్తున్నారు.
ఈ క్రమంలో వేములోవ, పిడతమామిడి, రాములుదేవపురం, వడ్డిచెరువు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, అడవి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. పశువులను బయటకు వదలొద్దని స్పష్టం చేశారు.
గత నాలుగు నెలల్లో దాదాపు 20 పశువులపై ఈ పెద్దపులి దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. పులి దాడుల్లో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో సూచించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయని అధికారులు తెలిపారు. పులిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చినా, దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అటవీ శాఖ వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















