పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా కొనసాగించేందుకు అమెరికా రహస్యంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిందని ఆయన వెల్లడించారు.
వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “ప్రపంచానికి తెలియని ఒక విషయం చెబుతున్నాను. హర్మూజ్ జలసంధి మీదుగా లక్షలాది బ్యారెళ్ల చమురును సురక్షితంగా తరలించేందుకు మేము సీక్రెట్ మిషన్ చేపట్టాం. ఒక్క రాత్రిలోనే 22 నౌకలను రాడార్లకు చిక్కకుండా, లైట్లు లేకుండా సురక్షితంగా పంపించాం” అని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై స్పష్టత లేకపోవడంతో పలు ప్రశ్నలు తలెత్తాయి. ఏ దేశానికి చెందిన నౌకలు, ఎక్కడి నుంచి ప్రయాణించాయి అనే అంశాలపై ట్రంప్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో అమెరికా సైన్యానికి చెందిన సీనియర్ అధికారి స్పందిస్తూ, ట్రంప్ ప్రస్తావించింది వాణిజ్య మరియు చమురు నౌకలకు అమెరికా నౌకాదళం భద్రత కల్పించిన ఆపరేషన్ గురించేనని వివరించారు. హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు అమెరికా గైడెడ్ ఎస్కార్ట్ సేవలు అందించిందని చెప్పారు.
ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల కేంద్రబిందువుగా మారింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్గంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టమవుతున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, హర్మూజ్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















