ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్) 5వ సీజన్‌లో భీమవరం బుల్స్ తొలిసారి ఛాంపియన్లుగా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భీమవరం బుల్స్ పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ 10 వికెట్ల తేడాతో సింహాద్రి వైజాగ్ లయన్స్‌ను ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన వైజాగ్ లయన్స్ జట్టు భీమవరం బౌలర్ల దెబ్బకు నిలవలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌లో చెన్నుపాటి రవితేజ 3/22తో అద్భుత ప్రదర్శన చేయగా, మోపాడ రవికిరణ్ 1/20, బైలపూడి యశ్వంత్ 1/24, హేమంత్ రెడ్డి 1/17, తోట శ్రావణ్ 1/11తో సమర్థవంతంగా రాణించారు. త్రిపురణ విజయ్ 39 పరుగులతో ఒక్కడే కొంత ప్రతిఘటన చూపించాడు.
లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భీమవరం బుల్స్ ఓపెనర్లు పూర్తిగా చెలరేగిపోయారు. రేవంత్ రెడ్డి 71 పరుగులు (33 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, హేమంత్ రెడ్డి 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి జట్టును కేవలం 9 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా విజయతీరానికి చేర్చారు.
ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. విజేత భీమవరం బుల్స్ జట్టుకు రూ.35 లక్షలు, రన్నరప్ సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ లభించింది.
కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్, విశాఖపట్నం ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















