ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌లలో భద్రతపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. తాజాగా టెలిగ్రామ్ (Telegram)కు కాపీరైట్ ఉల్లంఘన కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసింది.
పైరసీకి సంబంధించిన ఛానళ్లు, సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అల్టిమేటం కూడా ఇచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన కేవలం సివిల్ కేసు మాత్రమే కాకుండా క్రిమినల్ నేరమని కేంద్రం స్పష్టం చేసింది.
టెలిగ్రామ్ వేదికగా పైరసీ కంటెంట్ విస్తృతంగా షేర్ అవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రొడ్యూసర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, దర్యాప్తు సంస్థల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ వ్యవస్థ వివరాలను కూడా సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.
ఇటీవల నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ నోటీసులు జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదే సమయంలో చిన్నారులపై లైంగిక వేధింపులు, సైబర్ మోసాలు, వివాదాస్పద ప్రకటనలపై మెటా (Meta), ఇన్‌స్టాగ్రామ్ (Instagram)కు కూడా కేంద్రం నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















