శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చేసిన రాజీనామాను ట్రస్టు ఆమోదించింది. ఆయన స్థానంలో ట్రస్టు శాశ్వత సభ్యుడు కృష్ణ మోహన్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయోధ్యలో సోమవారం జరిగిన ట్రస్టు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. ట్రస్టులోని 9 మంది శాశ్వత సభ్యుల్లో ఏడుగురు సమావేశానికి హాజరయ్యారు. ట్రస్టు ఛైర్మన్ నృత్య గోపాల్ దాస్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి వివరాలను వెల్లడించారు. చంపత్ రాయ్‌తో పాటు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర సమర్పించిన రాజీనామాలను ఆమోదించినట్లు తెలిపారు. కొత్తగా ట్రస్టు సీఈవో నియామకం కోసం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
విరాళాల దుర్వినియోగం అంశంపై చంపత్ రాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు గోవింద్ గిరి తెలిపారు. దర్యాప్తులో నిందితులు బయటపడటంతో పాటు వారికి శిక్ష పడే వరకు మనశ్శాంతి ఉండదని చంపత్ రాయ్ చెప్పినట్లు వివరించారు.
విరాళాల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తుది నివేదిక కోసం ట్రస్టు ఎదురుచూస్తోందని తెలిపారు. ఈ నెల 22న మరోసారి ట్రస్టు సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ సమావేశానికి ముందే సిట్ నివేదిక అందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎవరీ కృష్ణ మోహన్?
కృష్ణ మోహన్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో శాశ్వత సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2025 సెప్టెంబరులో ఆయన ట్రస్టు శాశ్వత సభ్యుడిగా నియమితులయ్యారు.
ఆయన ఆరెస్సెస్ సీనియర్ సభ్యుడిగా ఉన్నారు. ఇండియన్ ఫారెస్టు సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) మాజీ అధికారి అయిన కృష్ణ మోహన్ గతంలో మహారాష్ట్ర క్యాడర్‌లో సేవలందించారు. అంతకుముందు అణుశక్తి విభాగంలోనూ పనిచేశారు.
లఖ్‌నవూ విశ్వవిద్యాలయం నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయనకు పరిపాలన, పర్యావరణ రంగాల్లో అనుభవం ఉంది. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయనకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ద్వారా ట్రస్టు పరిపాలనా వ్యవస్థను కొనసాగించాలని నిర్ణయించింది.
విరాళాల నిర్వహణ, ఆలయ పరిపాలన, భవిష్యత్ కార్యక్రమాలపై ట్రస్టు మరింత పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఈవో నియామకం, సిట్ నివేదిక అనంతరం ట్రస్టులో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















