వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు అనుమతి (ల్యాండ్ కన్వర్షన్) మంజూరు చేయాలంటే లంచం డిమాండ్ చేసిన ఓ తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాలలో చోటుచేసుకుంది.
ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం నాగపురి శివారులోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న 30 గుంటల వ్యవసాయ భూమిని వాణిజ్య స్థలంగా మార్చేందుకు భూ పట్టాదారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అనుమతి ప్రక్రియను పూర్తి చేసేందుకు చేర్యాల తహసీల్దార్ కర్ర దిలీప్‌నాయక్ రూ.1.10 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
అంత మొత్తం చెల్లించలేనని బాధితుడు కోరడంతో చివరకు రూ.70 వేలుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు.
సోమవారం నిర్ణయించిన ప్రకారం ఫిర్యాదుదారు రూ.70 వేల నగదును తహసీల్దార్ దిలీప్నాయక్కు అందిస్తుండగా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సంబంధిత పత్రాలు, నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఇందుకోసం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064, వాట్సప్ నంబరు 94404 46106 ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు.
అవినీతిని అరికట్టేందుకు ప్రజల సహకారం అవసరమని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. లంచం తీసుకునే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















