ప్రజా రాజధాని అమరావతిలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వేడుకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. అమరావతిలోని పరేడ్ మైదానాన్ని సిద్ధం చేయడంతో పాటు సందర్శకులు, అధికారులు, వాహనాల కోసం అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రూ.3.17 కోట్ల అంచనా వ్యయంతో పనులకు టెండర్లను ఆహ్వానించింది. పరేడ్ మైదానం అభివృద్ధి, గ్రౌండ్ చదును చేయడం, అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, ఇతర అనుబంధ పనులను ఇందులో చేర్చినట్లు సమాచారం.
టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సీఆర్‌డీఏ గడువు విధించింది. స్వాతంత్య్ర వేడుకలకు సమయం తక్కువగా ఉండటంతో పనులను వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రాజధాని అమరావతిలో నిర్వహించే ఈ వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో, పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలపై కూడా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అమరావతిని పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేసే క్రమంలో అక్కడ జాతీయ స్థాయి కార్యక్రమాలను నిర్వహించేందుకు అనువైన వేదికలను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలను రాజధాని ప్రాంతంలో నిర్వహించడం ద్వారా అమరావతి ప్రాధాన్యాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















