జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయిన భారత్.. ఈసారి విజయంతో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మతో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో మరో 16 పరుగులు చేస్తే 6 వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. 200 కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించే అవకాశం అతడికి ఉంది.
ప్రస్తుతం అభిషేక్ శర్మ 203 టీ20 మ్యాచ్‌ల్లో 199 ఇన్నింగ్స్‌లు ఆడి 5,984 పరుగులు సాధించాడు. ఇందులో టీమ్‌ఇండియా తరఫున 53 మ్యాచ్‌లు ఆడాడు. 6 వేల పరుగుల మైలురాయిని అందుకుంటే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సరసన చేరనున్నాడు.
భారత్ తరఫున కేఎల్ రాహుల్ 166 ఇన్నింగ్స్‌ల్లోనే 6 వేల పరుగులు పూర్తి చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 184 ఇన్నింగ్స్‌లు, శుభ్‌మన్ గిల్ 185 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.
ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ‘యూనివర్సల్ బాస్’ కేవలం 162 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















