దిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2026)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్ దిల్లీ రైడర్స్-న్యూదిల్లీ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ ఆడిన బలమైన షాట్ అంపైర్ ముఖానికి నేరుగా తగిలింది. దీంతో అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్ మైదానంలోనే కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మెరుగుపడేందుకు ఐసీయూలో ఉంచినట్లు పలు కథనాలు వెల్లడించాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ దిల్లీ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూదిల్లీ టైగర్స్ 156 పరుగులకే ఆలౌటైంది.
టైగర్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ను ఆశిశ్ మీనా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్‌లో బ్యాటర్ లక్ష్య ధారేజా బలమైన స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. వేగంగా దూసుకొచ్చిన బంతి అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్ ముఖానికి నేరుగా తాకింది. ఊహించని దెబ్బతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు.
ఈ ఘటనతో బ్యాటర్ లక్ష్య ధారేజా కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే మైదానంలోని సిబ్బంది అంపైర్‌కు ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆయనను ఐసీయూలో ఉంచినట్లు కథనాలు వెలువడ్డాయి.
ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంపైర్‌కు బంతి తగిలిన దృశ్యాలు చూసిన క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర్మేశ్ భరద్వాజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















