పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనా కీలక పాత్ర పోషించగలవని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు బదులుగా దౌత్య మార్గాలను ఎంచుకుంటే.. ఈ విషయంలో భారత్, చైనా నుంచి వచ్చే ఒత్తిడి ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువును కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ముందున్నాయని ఆమె అన్నారు. ముఖ్యంగా ఇరాన్ నుంచి ఇంధన దిగుమతుల్లో చైనా చాలా ముందుందని తెలిపారు.
ఇరాన్‌తో వ్యవహరించే విషయంలో ట్రంప్ కేవలం బెదిరింపులకే పరిమితం కాకుండా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని హిల్లరీ సూచించారు. అలా చేస్తే భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చే దౌత్యపరమైన, ఆర్థిక ఒత్తిడి సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
వ్యూహాత్మక స్థాయిలో ఏర్పడిన అపోహలు, పరస్పర అవగాహన లోపాలే ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయని హిల్లరీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో స్థిరత్వం కోసం బెదిరింపుల కంటే చర్చలు, దౌత్య మార్గాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















