తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల్లో ప్రత్యేకత ఏమిటంటే.. రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు రుసుం రూ.100 కాగా.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
అర్హతలు ఇవే..
అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అందులో గణితం, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంత వేతనం?
బీపీఎం పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు వేతన శ్రేణి ఉంది. ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు చెల్లిస్తారు. ఎంపికైన వారు రోజుకు సుమారు నాలుగు గంటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలకు సంబంధించి అదనపు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు?
ఆంధ్రప్రదేశ్‌లో 918, తెలంగాణలో 419 జీడీఎస్ పోస్టులు ఉన్నట్లు వివరాలు వెల్లడయ్యాయి. సర్కిల్, డివిజన్ వారీగా ఖాళీల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Vacant Posts’ విభాగంలో పరిశీలించవచ్చు.
ముఖ్యంగా: ఎంపికైన అభ్యర్థులకు విధుల నిర్వహణ కోసం అవసరమైన ల్యాప్‌టాప్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాలను తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో ఉండేలా అభ్యర్థులు నివాసం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















