ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రసాయనాల ప్రభావాల అధ్యయనమే టాక్సికాలజీ

August 28, 2026
in Education, News
0
రసాయనాల ప్రభావాల అధ్యయనమే టాక్సికాలజీ

రసాయనాల ప్రభావాల అధ్యయనమే టాక్సికాలజీ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పోటీపరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌-సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో టాక్సికాలజీ ఒక ముఖ్యమైన అంశం. రసాయనాలు, భౌతిక లేదా జీవ సంబంధ పదార్థాలు పర్యావరణం, ప్రాణులపై కలిగించే హానికర ప్రభావాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు.

ప్రమాదకర రసాయనాలకు జీవులు ఎలా గురవుతున్నాయి? వాటి ప్రభావం శరీరంపై ఎలా ఉంటుంది? విషపదార్థాల వల్ల కలిగే సమస్యలను ఎలా గుర్తించాలి? వాటికి ఎలాంటి చికిత్సా విధానాలు అందించాలి? వంటి అంశాలను టాక్సికాలజీ అధ్యయనం చేస్తుంది. ప్రధానంగా విషపదార్థాలు, రసాయనాల ప్రతికూల ప్రభావాలపై దృష్టి సారించే ఈ శాస్త్రాన్ని ‘భద్రతాశాస్త్రం’ (Science of Safety) అని కూడా పిలుస్తారు.

టాక్సికాలజీకి ప్రజారోగ్యం, వైద్యం, పరిశోధన, న్యాయశాస్త్రం వంటి అనేక రంగాల్లో ప్రాధాన్యం ఉంది. రసాయనాలు, విషపదార్థాలు, కాలుష్య కారకాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను గుర్తించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

  • ప్రజారోగ్యం: విషపదార్థాలు, కాలుష్య కారకాల ప్రభావాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది.
  • వైద్యం: విషపూరిత పదార్థాలకు గురైనవారికి సరైన చికిత్స అందించడంలో సహాయపడుతుంది.
  • పరిశోధన: రసాయనాలు, ఔషధాల ప్రభావాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.
  • న్యాయశాస్త్రం: విషప్రయోగం వంటి కేసుల్లో ఆధారాలను విశ్లేషించడంలో కీలకంగా ఉంటుంది.

టాక్సికాలజీ విస్తృతమైన శాస్త్రం. ఇందులో వివిధ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.

ఔషధ విషవిజ్ఞానశాస్త్రం: ఔషధాలు శరీరంపై చూపే విషపూరిత లేదా ప్రతికూల ప్రభావాలను అధ్యయనం చేస్తుంది.

పారిశ్రామిక విషవిజ్ఞానశాస్త్రం: పరిశ్రమల్లో ఉపయోగించే రసాయనాలు, కార్మికుల ఆరోగ్యంపై వాటి ప్రభావాలను పరిశీలిస్తుంది.

పర్యావరణ విషవిజ్ఞానశాస్త్రం: గాలి, నీరు, నేలలోని కాలుష్య కారకాలు పర్యావరణం, జీవులపై చూపే ప్రభావాలను అధ్యయనం చేస్తుంది.

విశ్లేషణాత్మక విషవిజ్ఞానశాస్త్రం: విషపదార్థాలను గుర్తించడం, వాటి పరిమాణాన్ని నిర్ధారించడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది.

ఫోరెన్సిక్‌ విషవిజ్ఞానశాస్త్రం: నేర పరిశోధనల్లో విషపదార్థాలు, రసాయనాల పాత్రను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

రసాయనాలు, విషపదార్థాలకు గురైనప్పుడు జీవుల్లో ప్రధానంగా రెండు రకాల ప్రభావాలు కనిపించవచ్చు. అవి తీవ్రమైన ప్రభావాలు మరియు దీర్ఘకాలిక ప్రభావాలు.

తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో రసాయనాలకు గురైనప్పుడు తీవ్రమైన ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం పాటు రసాయనాలకు గురికావడం వల్ల దీర్ఘకాలిక ప్రభావాలు ఏర్పడవచ్చు.

ఈ ప్రభావాలు వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, రసాయనం రకం, మోతాదు, దానికి గురైన సమయం, గురైన విధానం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.

రసాయనాలు, కాలుష్య కారకాలకు గురయ్యే పరిస్థితులు, ఆరోగ్యంపై ప్రభావం చూపే వివిధ రసాయనాలు, వాటి వల్ల కలిగే సమస్యలు తదితర అంశాలపై పూర్తి సమాచారం ఈ-బుక్‌ రూపంలో ‘ఈనాడు ఈప్రతిభ’ వెబ్‌సైట్‌లోని ‘జనరల్‌ స్టడీస్‌ ఈ-బుక్స్‌’ కోర్సులో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం సంబంధిత క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయండి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Chemical EffectsChemical PollutionCompetitive ExamsEnvironmental ToxicologyGeneral StudiesPharmaceutical Toxicologyscience and technologyScience NotesToxic SubstancesToxicology
ShareTweetSend
Previous Post

మీరాలం చెరువు.. హైదరాబాద్‌ కొత్త టూరిస్టు స్పాట్‌

Next Post

ఇంజినీరింగ్‌ కంటే ఎంబీఏకే భారీ ప్యాకేజీలు

Related Posts

యమహా వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2 విడుదల.. రూ.2.30 లక్షల నుంచి ధరలు
Business News

యమహా వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌2 విడుదల.. రూ.2.30 లక్షల నుంచి ధరలు

August 28, 2026
లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి
India News

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

August 28, 2026
సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’
Business News

సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

August 28, 2026
ఉద్యోగ వేటకు ఏఐ అండ.. ఒక్క యాప్‌లోనే కొలువుల సమాచారం
Technology News

ఉద్యోగ వేటకు ఏఐ అండ.. ఒక్క యాప్‌లోనే కొలువుల సమాచారం

August 28, 2026
ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు
Business News

ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు

August 28, 2026
లిస్టింగ్‌లో టెంప్‌సెన్స్‌ జోరు.. 111% ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశం
Stock Market News

లిస్టింగ్‌లో టెంప్‌సెన్స్‌ జోరు.. 111% ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశం

August 28, 2026
Next Post
ఇంజినీరింగ్‌ కంటే ఎంబీఏకే భారీ ప్యాకేజీలు

ఇంజినీరింగ్‌ కంటే ఎంబీఏకే భారీ ప్యాకేజీలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 28, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 28, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
28 ఆగస్టు 2026 (శుక్రవారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 28, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

August 28, 2026
సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

August 28, 2026
ఉద్యోగ వేటకు ఏఐ అండ.. ఒక్క యాప్‌లోనే కొలువుల సమాచారం

ఉద్యోగ వేటకు ఏఐ అండ.. ఒక్క యాప్‌లోనే కొలువుల సమాచారం

August 28, 2026
ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు

ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు

August 28, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

లొంగిపోయిన మావోలకు పునర్జన్మ.. రాఖీల తయారీతో స్వయం ఉపాధి

August 28, 2026
సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

సుభాష్‌చంద్ర క్లారిటీ.. ‘‘రూ.22 వేల కోట్లు కాదు.. నా క్లెయిమ్‌ రూ.3,992 కోట్లే’’

August 28, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.