ఇ-20 పెట్రోల్ స్థానంలో ఇ-10 పెట్రోల్‌ను తీసుకొచ్చే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) స్పష్టం చేసింది. ఇ-20 పెట్రోల్‌కు అనుగుణంగా లేని పాత వాహనాల యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా తక్కువ శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకురావాలా? అనే అంశంపై చర్చ జరుగుతోందని సంస్థ తెలిపింది.
పాత వాహనాల ఇంజిన్లలో ఇ-20 ఇంధనం వినియోగం వల్ల కొన్ని విడిభాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇ-20తో పాటు ఇ-10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచే అవకాశాలపై చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఉన్న పెట్రోల్ పంపిణీ వ్యవస్థలో రెండు రకాల ఇంధనాలను సరఫరా చేయడం సాధ్యమేనా? వాటి నిల్వ, రవాణా, పంపిణీ విధానం ఎలా ఉండాలి? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు బీపీసీఎల్ తెలిపింది. అయితే ఇ-20 స్థానంలో ఇ-10 పెట్రోల్‌ను తీసుకొస్తామని తాను ఎక్కడా చెప్పలేదని బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ సంజయ్ ఖన్నా స్పష్టం చేశారు.
ఒకవేళ ప్రభుత్వం భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయిస్తే.. ఇ-20 నుంచి ఇ-10 పెట్రోల్‌కు మారడంలో నిర్వహణపరంగా లేదా లాజిస్టిక్స్ పరంగా పెద్దగా సవాళ్లు ఉండవని ఆయన పేర్కొన్నారు.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే ఇ-20కు అనుకూలంగా లేని పాత వాహనాల విషయంలో తలెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇ-10 పెట్రోల్ అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇ-10ను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలా? లేదా ఇ-20 సరఫరానే కొనసాగించాలా? అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బీపీసీఎల్ స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















