ఒకవైపు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరేందుకు అత్యంత కీలకమైన మ్యాచ్.. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని పునరాగమనంపై కొనసాగుతున్న ఊహాగానాలు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం హైప్రెషర్ పరిస్థితిని ఎదుర్కొంటోంది.
12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన సీఎస్‌కేకు మిగిలిన రెండు మ్యాచ్‌లు నాకౌట్ రేసులో నిర్ణయాత్మకంగా మారాయి. ఈ క్రమంలో నేడు చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు మైదానంలోకి అడుగు పెట్టని ధోని ఆడతాడన్న చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌తోనే ఆయన రిటైర్మెంట్ ప్రకటించవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ భిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక సమయంలో ధోని బరిలోకి దిగే అవకాశం తక్కువని, జట్టు కూర్పులో పెద్ద మార్పులు చేయకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ధోని ఆడితే అది ఆశ్చర్యకరమైన పరిణామమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
“ధోని దాదాపు ఏడాది నుంచి పోటీ క్రికెట్ ఆడలేదు. ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ మ్యాచ్ ఫిట్‌నెస్‌లో పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని అనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అతడిని బరిలోకి దించటం కష్టమే. సీఎస్‌కేకు ఇది చాలా కీలక మ్యాచ్. ప్లేఆఫ్స్ అవకాశాలు నిలుపుకోవాలంటే గెలవాల్సిందే. ధోని జట్టు మనిషే అయినా, ఇప్పటి పరిస్థితుల్లో అతడు ఆడతాడని నేను అనుకోవడం లేదు” అని గావస్కర్ అన్నారు.
ఇక మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా వ్యాఖ్యల్లో ఈ మ్యాచ్‌లో ధోని ఆడకపోవచ్చని, బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అకీల్ హుస్సేన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















