ఐపీఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన Sunrisers Hyderabad ఈసారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గతంలో భారీ స్కోర్లు నమోదు చేసి రికార్డులు సృష్టించిన ఈ జట్టు, గత సీజన్‌లో మాత్రం నిలకడలేమితో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇప్పుడు మళ్లీ బలమైన జట్టుతో కప్పు సాధించాలన్న పట్టుదలతో రంగంలోకి దిగుతోంది.
2016లో టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ ట్రోఫీ అందుకోలేకపోయిన సన్‌రైజర్స్… 2018, 2024ల్లో ఫైనల్ వరకు వెళ్లినా చివరి అడుగులో జారిపోయింది. ఈసారి ఆ నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ Liam Livingstone చేరిక జట్టుకు అదనపు బలం. అయితే కెప్టెన్ Pat Cummins గాయంతో ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కావడం పెద్ద దెబ్బగా మారింది.
బ్యాటింగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ దుమ్మురేపే స్థాయిలో ఉంది. Travis Head, Abhishek Sharma ఓపెనింగ్ జోడీ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగలదు. వీరి తర్వాత Ishan Kishan, Heinrich Klaasen, నితీశ్‌కుమార్‌రెడ్డి వంటి హిట్టర్లు ఉండటం జట్టుకు అతిపెద్ద బలం. భారీ స్కోర్లు చేయడం ఈ జట్టుకు సహజం.
అయితే బౌలింగ్ విభాగం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గత సీజన్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోవడం, ఎక్కువ పరుగులు ఇవ్వడం జట్టుకు నష్టమైంది. ఈసారి కూడా అదే సమస్యలు కొనసాగితే బ్యాటింగ్ బలం ఉన్నా ఫలితం దక్కకపోవచ్చు. కమిన్స్ గైర్హాజరీతో పేస్ దాడి మరింత బలహీనపడే అవకాశం ఉంది.మొత్తానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈసారి బ్యాటింగ్ బలం పెద్ద ఆయుధం కాగా, బౌలింగ్‌లో మెరుగుదల సాధిస్తే టైటిల్‌పై గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APDevelopment APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews ViralNews WorldNews



















