మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి Revanth Reddy రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 119 సూపర్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
మహిళా సంఘాలకు నామమాత్రపు లీజుపై స్థలాలు, సున్నా వడ్డీతో బ్యాంకు రుణాలు అందిస్తామని సీఎం తెలిపారు. రైస్‌మిల్లులు, లాజిస్టిక్స్ హబ్‌లు, గోదాములు మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే నిర్మించనున్నట్లు వెల్లడించారు.
సచివాలయం నుంచి వర్చువల్‌గా 8,000 మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేసిన సీఎం, మహిళలను ఆర్థికంగా బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాలకు కీలక పాత్ర కల్పిస్తామని తెలిపారు.
మహిళలు వ్యాపార రంగంలో అదానీ, అంబానీలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.60 వేల కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించామని, వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని వెల్లడించారు.2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















