విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
అజిత్ పవార్‌ను కడసారి చూసేందుకు ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటితో నివాళులర్పించారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. రన్‌వేపై ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకోవడంతో ఆయనతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
అజిత్ పవార్‌కు భార్య సునేత్ర పవార్ (రాజ్యసభ సభ్యురాలు), కుమారులు పార్థ్, జే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను స్మరిస్తూ పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















