మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు పరిధిలోని చందాపూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందాపూర్ గ్రామానికి చెందిన మహదేవప్ప (48) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు నుంచి Bharatiya Janata Party (భాజపా) తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మహదేవప్ప భార్య సత్తెమ్మ కీలక ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థుల నుంచి నిరంతర వేధింపులు, అవమానకర వ్యాఖ్యల కారణంగానే తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.మహదేవప్ప మృతి వార్తతో మక్తల్ పట్టణంతో పాటు చందాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భాజపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల ప్రచార వాతావరణంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆరో వార్డు ఎన్నిక రద్దు
ఈ ఘటన నేపథ్యంలో మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు ఎన్నికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. భాజపా అభ్యర్థి మహదేవప్ప మృతి కారణంగా ఎన్నిక నిర్వహణ సాధ్యం కాదని, తదుపరి నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రకటిస్తామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















