నీట్‌లో మంచి స్కోర్ సాధించినప్పటికీ సీటు రాకపోవడం అథర్వ్ చతుర్వేదిని తీవ్రంగా కలచివేసింది. ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన తనలాంటి విద్యార్థులకు విధానపరమైన లోపాల వల్ల అన్యాయం జరుగుతోందని అతడు భావించాడు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయకపోవడం వల్లే తనకు అడ్మిషన్ రాలేదని గుర్తించాడు.
అందుకే న్యాయం కోసం నేరుగా సుప్రీంకోర్టు తలుపుతట్టాడు. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను స్వయంగా తయారుచేసి దాఖలు చేయడం అతడి పట్టుదలను చూపించింది. విచారణ సందర్భంగా “నాకు ఒక్క 10 నిమిషాలు సమయం ఇవ్వండి” అని ప్రధాన న్యాయమూర్తిని కోరడం… కోర్టు హాల్‌లో ఉన్నవారందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ 10 నిమిషాల్లోనే అథర్వ్ తన సమస్యను, విధానంలోని లోపాలను స్పష్టంగా వివరించాడు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నారని వివరించాడు. అతడి వాదనలను గమనించిన న్యాయస్థానం, విద్యార్థి భవిష్యత్తు విధానపరమైన లోపాల బలి కాకూడదని స్పష్టం చేసింది.2025–2026 విద్యా సంవత్సరానికి అతడికి అడ్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం ఒక విద్యార్థి విజయం మాత్రమే కాదు… ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగిన ఉదాహరణగా నిలిచింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















