టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తన జీవితంలోని కష్టసుఖాలను తాజాగా ఓ చిట్‌చాట్‌లో గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తన బ్యాంక్ అకౌంట్‌లో రూ.50వేలు కనిపించడం కూడా ఓ కలలా అనిపించేదని చెప్పారు. ‘HIT: The First Case’ సినిమాకు అడ్వాన్స్ వచ్చి బ్యాంక్‌లో రూ.50వేలు జమ అయినప్పుడు జీవితంలో మొదటిసారి అంత డబ్బు చూసి ఎంతో ఆనందపడ్డానన్నారు. అనంతరం ‘Falaknuma Das’ విడుదలైన తర్వాత తన ఖాతాలో రూ.లక్ష చూసి ఎంతో సంతోషించానని వెల్లడించారు. ఒకప్పుడు అదే తన పెద్ద లక్ష్యమని తెలిపారు.
కుటుంబ పరిస్థితులు.. ఆర్థిక ఇబ్బందులు
విశ్వక్ సేన్ మాట్లాడుతూ…తన తండ్రి మొదట కరాటే శిక్షకుడిగా పనిచేశారని, కానీ ఆదాయం సరిపోక కన్‌స్ట్రక్షన్ రంగంలోకి వెళ్లారని చెప్పారు,తాను పుట్టినప్పుడు కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని వెల్లడించారు,పెద్ద చదువులు చదవడానికి డబ్బులు ఎక్కువవుతాయని భావించి డిగ్రీలో చేరినట్లు తెలిపారు. ఆ రోజుల్లో రూ.లక్ష తన ఖాతాలో ఉంటే చాలని అనుకునేవాడినని ఆయన చెప్పారు.
వ్యక్తిత్వం కోల్పోతే జీవితం వృథా”
తాను ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తినని విశ్వక్ సేన్ అన్నారు. ఆ స్వభావం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయినా, తన నిజాయితీపై గర్వంగా ఉన్నానని చెప్పారు. “ఇంట్లో ఎలా ఉంటానో, బయట కూడా అలాగే ఉంటాను. ఇండస్ట్రీకి వచ్చానని ఒక్కసారిగా మారిపోలేను. వ్యక్తిత్వం కోల్పోతే మనపై మనకే గౌరవం ఉండదు, ఇలా ఉంటే ఇండస్ట్రీలో నిలబడలేవని చాలామంది భయపెట్టారని, ‘కొన్ని రోజుల్లోనే వెళ్లిపోతావు’ అని కూడా అన్నారని గుర్తుచేశారు.
సినిమాలే మాట్లాడాలి
విశ్వక్ సేన్ అభిప్రాయం ప్రకారం…సినిమా బాగుంటే ప్రేక్షకులు హీరో ఎవరో చూసుకోరు. కథ బాగోలేకపోతే స్టార్ హీరో ఉన్నా సినిమా హిట్ కాదు, కంటెంట్ ముఖ్యమని, అదే నిలబెడుతుందని విశ్వసిస్తానన్నారు. తన ప్రయాణం కష్టాలతో మొదలైనా, క్రమంగా ప్రతి అడుగు ముందుకేసి ఎదిగానని చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















