పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం కేవలం చదువు మీదే ఆధారపడదు. సమాధానాలు ఎలా రాస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. తెలివైన ప్రదర్శన (Smart Presentation)తో సాధారణ సమాధానాలకే పూర్తి మార్కులు సాధించవచ్చు.
తెలిసిన ప్రశ్నలతోనే బోణీ!
పరీక్షా పత్రం చేతికి రాగానే తొందరపడకండి.
- ముందుగా ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదవండి.
- బాగా తెలిసిన ప్రశ్నలను గుర్తించండి.
- వాటితోనే సమాధానాలు ప్రారంభఇలా చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవచ్చు.
- మూల్యాంకనం చేసే వారికి మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
సూటిగా – సుత్తి లేకుండా సమాధానం
- అవసరానికి మించిన పొడవాటి పేరాగ్రాఫ్‌లు రాయవద్దు.
- ప్రశ్న అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇవ్వండి.
- మార్కుల వెయిటేజీ (2, 3, 5, 10)ను బట్టి సమాధానం పొడవు ఉండాలి.
2 మార్కుల ప్రశ్నకు 2–3 పాయింట్లు సరిపోతాయి.
10 మార్కుల ప్రశ్నకు పరిచయం, ముఖ్యాంశాలు, ముగింపు ఉండాలి.
కీవర్డ్స్‌కు ప్రాధాన్యం
- ముఖ్య పదాలు (Keywords)
- తేదీలు
- సూత్రాలు
- నిర్వచనలు
ఇవన్నీ పెన్సిల్‌తో గీత గీయండి లేదా స్పష్టంగా చూపండి.
కీవర్డ్స్ స్పష్టంగా కనిపిస్తే మూల్యాంకనం వేగంగా జరుగుతుంది.
సరైన పదజాలం వాడితే పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది
బుల్లెట్ పాయింట్లు & సబ్ హెడ్డింగులు
పెద్ద సమాధానాలను ఇలా విభజించండి:
- చిన్న చిన్న హెడ్డింగులు
- బుల్లెట్ పాయింట్లు
- సంఖ్యల వారీగా వివరాలు
ఇది మీ పేపర్‌ను క్లియర్‌గా, ఆకర్షణీయంగా చూపిస్తుంది.
దిద్దేవారికి అర్థమయ్యేలా ఉంటుంది.
డయాగ్రామ్స్‌తో పూర్తి మార్కులు
సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో:
- వీలైన చోట బొమ్మలు గీయండి
- పెన్సిల్‌తో neatగా గీయండి
- భాగాలను స్పష్టంగా లేబుల్ చేయండి
సరైన డయాగ్రామ్ అదనపు మార్కులు తెచ్చిపెడుతుంది.
సమాధానాల మధ్య ఖాళీ వదలండి
- గజిబిజిగా రాయవద్దు
- ప్రతి సమాధానం తర్వాత కొద్దిగా స్పేస్ వదలండి
- ప్రశ్న సంఖ్య స్పష్టంగా రాయండి
పరిశుభ్రమైన పేపర్ మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది
చివరి 10 నిమిషాలు – గోల్డెన్ టైమ్!
పరీక్ష ముగిసే ముందు:
✔ రోల్ నంబర్ సరిగా రాశారో చూడండి
✔ ప్రశ్న సంఖ్యలు సరిగ్గా ఉన్నాయో పరిశీలించండి
✔ అక్షరదోషాలు సరిచూడండి
✔ వదిలేసిన ప్రశ్నలు ఉన్నాయో చూడండి
టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం
మొత్తం సమయాన్ని మూడు భాగాలుగా విభజించండి:
- చదవడం – 5 నిమిషాలు
- రాయడం – ప్రధాన సమయం
- రివిజన్ – చివరి 10 నిమిషాలు
హ్యాండ్‌రైటింగ్ కూడా ముఖ్యం
అందంగా కాకపోయినా స్పష్టంగా ఉండాలి. చదవడానికి సులభంగా ఉండేలా రాయండి.
బ్లూప్రింట్ ప్రకారం ప్రిపరేషన్
ప్రతి సబ్జెక్ట్ బ్లూప్రింట్ ప్రకారం ముఖ్యాంశాలను సిద్ధం చేసుకుంటే పూర్తి మార్కులు సాధించవచ్చు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















