ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం – 2025’ ప్రదానం చేశారు. భారత కల్చరల్ అకాడమీ మరియు తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్తంగా ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, సీనియర్ నటి కవిత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఎండీ మరియు ఐఅండ్‌ప్ర్ కమిషనర్ ప్రియాంక తదితరులు హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, కళారంగానికి చెందిన వ్యక్తులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజేంద్రప్రసాద్ తన నటనా ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. నటుడిగా దాదాపు 48 ఏళ్ల సుదీర్ఘ అనుభవం తనకు ఉందని, ఐదు తరాల హీరోలతో కలిసి నటించే అదృష్టం తనకు దక్కిందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ రెండు కళ్లు అయితే, జానపద చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన కాంతారావు తిలకంలాంటి నటుడని కొనియాడారు.
‘లవకుశ’ చిత్రంలో లక్ష్మణుడిగా కాంతారావు చూపిన నటన ఇప్పటికీ చిరస్మరణీయమని, నారదుడి పాత్ర అంటే ప్రేక్షకులకు వెంటనే కాంతారావే గుర్తుకు వస్తారని ఆయన పేర్కొన్నారు. అలాంటి గొప్ప నటుడి పేరుతో ఏర్పాటైన అవార్డు తనకు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.
తన సినిమాలు గత నలభై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయని, వారి జీవితాల్లోని కష్టాలను కొంతసేపైనా మరిచిపించేలా చేయగలిగితే అదే తనకు నటుడిగా నిజమైన సంతృప్తి అని చెప్పారు. అందుకే ఇలాంటి పురస్కారాలను స్వీకరించే అర్హత తనకు ఉన్నదనే భావన తనకు ఉందని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రేమ్‌రాజ్, విజన్ వీవీకే అధినేత విజయ్‌కుమార్, నాగబాల డి.సురేశ్‌కుమార్, వెనిగళ్ల రాంబాబు, చిత్తరంజన్, అక్కినేని శ్రీధర్, మామిడి హరికృష్ణ తదితరులు కూడా పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















