ధురంధర్’ మొదటి భాగం సాధించిన భారీ విజయానంతరం ఇప్పుడు దాని సీక్వెల్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ విడుదలకు సిద్ధమవుతోంది. Ranveer Singh ప్రధాన పాత్రలో, Aditya Dhar దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మొదటి భాగమైన Dhurandhar మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా రెండో భాగం విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రేక్షకులు పార్ట్ వన్‌ను మరోసారి చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఈ చిత్రం ప్రస్తుతం Netflixలో మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇటీవల వరకు ఇండియాలో టాప్ 5లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు మూడో స్థానానికి చేరింది. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి 2.2 కోట్లకు పైగా వ్యూస్ లభించినట్లు సమాచారం. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈ వంటి దేశాల్లో కూడా ఈ చిత్రం టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.
ఇక సీక్వెల్‌గా వస్తున్న Dhurandhar 2: The Revengeపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల చేసిన ట్రైలర్ కూడా అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్‌లో సుమారు 312 మిలియన్ వ్యూస్ సాధించింది.
ఉగాది, ఈద్ పండుగల సమయం దగ్గర్లోనే ఈ సినిమా విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యాక్షన్, థ్రిల్, కథలోని ట్విస్టులతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















