ప్రపంచ సినీ చరిత్రలో విజువల్ అద్భుతాలకు నూతన ప్రమాణాలు సృష్టించిన జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులు ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి సినిమా అపూర్వమైన విజయం సాధించగా, తర్వాత వచ్చిన చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధించినప్పటికీ కథా బలం విషయంపై కొంత విమర్శలు ఎదుర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం Avatar 4. ఇటీవల జరిగిన శాటర్న్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న జేమ్స్ కామెరూన్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నాలుగో భాగంపై తుది నిర్ణయం తీసుకోలేదని, కానీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయని తెలిపారు.
ఈ సారి కథను మరింత బలంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలను మరోసారి సమీక్షించి, ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. మొదటి సినిమా ఇచ్చిన అనుభూతిని తర్వాతి భాగాలు పూర్తిగా అందించలేదన్న విషయం తనకు తెలుసని కామెరూన్ అంగీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం 71 ఏళ్ల వయస్సులో ఉన్న జేమ్స్ కామెరూన్ ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారని సమాచారం. నాలుగో, ఐదో భాగాల కథలను సిద్ధం చేసి ఒకేసారి చిత్రీకరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల నిర్మాణానికి కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం పట్టే అవకాశముందని అంచనా.
జేమ్స్ కామెరూన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘అవతార్ 4’ను 2029లో, ‘అవతార్ 5’ను 2031లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక ఉంది. విజువల్ వండర్స్‌తో పాటు మరింత బలమైన కథతో ఈ సినిమాలు వస్తాయా అన్నదే ఇప్పుడు ప్రపంచ సినీ అభిమానుల్లో ప్రధాన చర్చగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















