దేశీయ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణిలో, ఒడుదొడుకులతో సాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. హర్మూజ్ జలసంధి అంశం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు భారత మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
మార్చి నెలలో విదేశీ మదుపర్లు భారీగా విక్రయాలు జరిపారు. ఈనెల ప్రారంభంలోనే వేల కోట్ల రూపాయలు ఉపసంహరించుకోవడం రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది. అందువల్ల విదేశీ పెట్టుబడిదారుల ధోరణి ఈవారం కీలకంగా మారనుంది.ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మార్కెట్ దిశను నిర్ణయించవచ్చు. వడ్డీ రేట్లు, ఆర్థిక అంచనాలపై స్పష్టత రానుంది. నిఫ్టీ 50 సూచీకి 22,200–22,300 స్థాయిల వద్ద మద్దతు లభించే అవకాశం ఉండగా, అది కంటే దిగితే 21,500–21,000 వరకు పడిపోవచ్చని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.
రంగాల వారీగా చూస్తే, బ్యాంకింగ్ రంగం ఒత్తిడిలోనే ఉండొచ్చు. లోహ రంగ షేర్లు మాత్రం బలంగా ఉండే అవకాశముంది. టెలికాం రంగంలో ఎయిర్‌టెల్, జియో వినియోగదారుల పెరుగుదలతో షేర్లు సానుకూలంగా కదలొచ్చు.
చమురు, గ్యాస్ రంగం షేర్లు ఒత్తిడిలో కొనసాగవచ్చు. ఐటీ రంగంలో ఏఐ ప్రభావం కారణంగా ఒడిదొడుకులు ఉండొచ్చు. ఎఫ్‌ఎమ్‌సీజీ, ఔషధ రంగాలు మిశ్రమంగా కదలే అవకాశం ఉంది.యుద్ధ పరిస్థితుల కారణంగా నిర్మాణ రంగం మందగమనంలో ఉండవచ్చు. సిమెంట్, మౌలిక వసతుల రంగాలపై కూడా ప్రభావం పడే అవకాశం
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















