అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైనప్పటి నుంచి Iran దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత ఐదు వారాలుగా ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ NetBlocks అంచనా ప్రకారం, 864 గంటలపాటు (36 రోజులపాటు) uninterrupted Internet blackout కొనసాగించడంలో ఇరాన్ రికార్డ్ సృష్టించింది.
ఫిబ్రవరి 28న ఈ దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడడంతో, ఇరాన్ ప్రపంచ దేశాలతో కాంటాక్ట్ కోల్పోయింది. దేశీయంగా పరిమిత స్థాయిలో మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి. నెట్‌బ్లాక్స్ తెలిపినట్లుగా, మయన్మార్, సూడాన్ వంటి దేశాలు సంక్షోభ సమయంలో ఇలాంటి ఆంక్షలు విధించినప్పటికీ, ఇంత సుదీర్ఘంగా ఏ దేశం కూడా కొనసాగించలేదని స్పష్టం చేశారు.
అయితే, ఉత్తర కొరియా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంతో మొదటినుంచి కనెక్ట్ కాకుండా ఉన్నట్లు గుర్తించబడింది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల్లో మౌలిక సదుపాయాలు ధ్వంసమైనప్పటి నుంచి సుదీర్ఘ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వినియోగదారుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
ఇంతకుముందు, యుద్ధ పరిస్థితుల కారణంగా ఏ దేశం కూడా ఇంత స్థాయిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయలేదు. అదేవిధంగా, శాటిలైట్ కనెక్షన్లు, వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ (VPN) లాంటి ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఇరాన్ ప్రభుత్వం నియంత్రణ విధించడంలో విజయం సాధించింది. ఫలితంగా, పౌరులు పూర్తిగా కమ్యూనికేషన్‌లో ఇబ్బందిపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















