పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, Donald Trump చేసిన తీవ్ర హెచ్చరికలు, Iran కఠిన ప్రతిస్పందనతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా విధించిన గడువు దగ్గరపడుతుండటంతో, ఇకపై ఏం జరుగుతుందన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఈ పరిణామాల్లో ముందున్న ప్రధాన అవకాశాలు ఇవి:
అవకాశం-1
చివరి నిమిషంలో సర్దుబాటు
- ఇచ్చిన గడువుకు కొద్ది గంటలముందు లేదా తర్వాత తెరవెనక చర్చలు వేగవంతం
- తన పంతం నుంచి వెనక్కి తగ్గేందుకు, పాక్షిక చర్చలకు ఇరాన్ అంగీకరించటం. హర్మూజ్ విషయంలో కాసింత సడలింపు
- ప్రత్యక్ష దాడుల్ని తాత్కాలికంగా అమెరికా నిలిపివేయడం
- రెండు పక్షాలూ తమదే విజయం అనేలా మధ్యస్థ సూత్రంతో ముందుకు రావటం
- కానీ ఐఆర్‌జీసీ (ఇరాన్ సైన్యం) ససేమిరా అంటుండటం; అమెరికా మాటలపై, హామీలపై నమ్మకం లేకపోవటం దీనికి అవరోధంగా మారే అవకాశం ఉంది.
అవకాశం-2
అమెరికా దాడులు… నియంత్రిత ప్రతిదాడులు
- హెచ్చరించినంత ఉద్ధృతంగా కాకుండా ముందుగా నిర్ణయించిన లక్ష్యాలపై అమెరికా నిర్దిష్ట దాడులు
- యధావిధిగా వాటికి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ సమాధానం
- చర్య-ప్రతిచర్యల తీవ్రతను పెంచకుండానే పరోక్ష/ప్రత్యక్ష చర్చలకు తలుపులు మూయకుండా నియంత్రిత యుద్ధాన్ని ఇరుపక్షాలూ కొనసాగించటం
- తన హెచ్చరిక ఉత్తుత్తిది కాదని ప్రపంచానికి చాటాలనే ఒత్తిడిలో ట్రంప్; బదులు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితిలో ఇరాన్! అలాగని ఇద్దరూ తెగేదాకా లాగలేకపోవటం… ఈ అవకాశానికి దారితీస్తుంది.
అవకాశం-3
యుద్ధం విస్తరణ దిశగా
- ఒకరిపై ఒకరు భారీగా విరుచుకుపడటం.
- ప్రతి స్పందనగా గల్ఫ్ దేశాలను పూర్తిస్థాయిలో ప్రభావితం చేసేలా ఇరాన్ యుద్ధాన్ని విస్తరించటం.
- ఇరాన్ మద్దతుదారులు (హూతీలు, హెజ్‌బొల్లా, ఇరాకీ మిలీషియా) రంగంలోకి
- ఇప్పటిదాకా అమెరికాపై ఆధారపడుతూ స్వీయభద్రతకే పరిమితమైన గల్ఫ్ దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధంలోకి దిగటం.
- పరిస్థితి పట్టుతప్పి నియంత్రణ దాటే దశకు చేరుకోవటం.
- కానీ ఇలా జరిగితే… ఇరుపక్షాలకూ భారీ నష్టం. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆయుధ సంపత్తి వేగంగా తగ్గే అవకాశం.
ట్రంప్ చేస్తున్న తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో అణ్వాయుధ దాడికి సాహసిస్తారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది! ఇరాన్‌ను చర్చలకు దించటానికే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదనా ఉంది! మొత్తానికి… పశ్చిమాసియా వేదికగా… బుధవారం ఏం
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















