జైపుర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా-2026 ఫైనల్‌లో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న 52 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి ఆమె అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఎవరీ కాజియా?
కేరళలోని మావెలిక్కారకు చెందిన కాజియా 2007లో జన్మించారు. ఆమె బాల్యం, పాఠశాల విద్య అంతా యూఏఈలోని అబుధాబిలోనే సాగింది. ప్రస్తుతం న్యాయశాస్త్రం అభ్యసిస్తూనే మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నారు.అందాల పోటీలతో పాటు కాజియాకు కళలపైనా ఆసక్తి ఉంది. 12 ఏళ్ల పాటు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. గానం, నటనలోనూ ప్రతిభ కనబరుస్తారు. డ్రమ్స్, వయొలిన్ వాయించడంతో పాటు వేదికపై ప్రసంగాలు చేయడంలోనూ అనుభవం ఉంది. మలయాళ చిత్రం ‘షైలాక్’లో నటించి సినీరంగంలోకి కూడా అడుగుపెట్టారు.
చిన్న వయసులోనే ఘనతలు :
మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొన్న వారిలో కాజియానే అత్యంత చిన్న వయస్కురాలు. అయితే అందాల పోటీలు ఆమెకు కొత్తేమీ కాదు. 17 ఏళ్ల వయసులో మిస్ టీన్ దివా-2024 టైటిల్‌ను గెలుచుకున్నారు. 2025లో మిస్ టీన్ ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొని తొలి రన్నరప్‌గా నిలిచారు.ఈ పోటీలో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేశ్ తొలి రన్నరప్‌గా నిలవగా.. గుజరాత్‌కు చెందిన అనుశీ సాత్వలేకర్ రెండో రన్నరప్‌గా నిలిచారు. అనుశీకి మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ కూడా దక్కింది.
‘నిశ్శబ్దం’పై కాజియా సమాధానం :
ఫైనల్ రౌండ్‌లో కాజియాను ‘‘మీ జీవితంలో నిశ్శబ్దానికి ఉన్న శబ్దాన్ని ఎలా వర్ణిస్తారు?’’ అని న్యాయనిర్ణేతలు ప్రశ్నించారు. దీనికి ఆమె తన అనుభవాలను జోడిస్తూ సమాధానం ఇచ్చారు.
వేదికపైకి రావడానికి ముందు ఏర్పడే నిశ్శబ్దం తనకు ప్రశాంతతను ఇస్తుందని, నృత్యకారిణిగా, నటిగా, అందాల పోటీలను ఇష్టపడే యువతిగా తాను ఎదిగిన వేదికపైకి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుందని వివరించారు.
‘‘ఇది మీ స్థలం అని మీకు అనిపించినప్పుడు వచ్చే నిశ్శబ్దం అది. సరిగ్గా అలాంటి స్థలంలోనే నేనున్నాను. నా భారత్‌లో నేనున్నాను’’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. చివరకు అదే వేదికపై కాజియా మిస్ యూనివర్స్ ఇండియా-2026 కిరీటాన్ని అందుకున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















