చందమామను చుట్టివచ్చే క్రమంలో విశ్వంలో మానవులెవ్వరూ వెళ్లనంత దూరం ప్రయాణించిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు మంగళవారం భూమి దిశగా తిరుగు పయనమవుతున్నారు. వీరి ఒరాయన్ వ్యోమనౌక.. జాబిల్లి వెనుక భాగానికి వెళ్లి, ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని పుడమి వైపునకు మళ్లింది. ఈ క్రమంలో చందమామ రెండో వైపునకు సంబంధించిన అద్భుత దృశ్యాలను వ్యోమగాములు వీక్షించారు. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని గ్రహాలనూ దూరం నుంచి చూశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వ్యోమగాములతో మాట్లాడారు. వారికి అభినందనలు తెలిపారు.
ఆర్టెమిస్-2 యాత్రలో భాగంగా అమెరికాకు చెందిన రీడ్ వైస్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడా వ్యోమగామి జెరెమీ హాన్సన్‌లు ఈ నెల 1న భూమి నుంచి బయల్దేరిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి వీరు భూమి నుంచి 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది 1970లో అపోలో-13 వ్యోమగాములు వెళ్లిన దూరం కన్నా దాదాపు 6,600 కిలోమీటర్ల దూరం అధికం. ‘‘మేం ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. మా కళ్లను మేం నమ్మలేకపోతున్నాం. మా రికార్డును ప్రస్తుతతరం కానీ తర్వాతి తరంకానీ చాలా వేగంగా చెరిపేయాలి’’ అని జెరెమీ హాన్సన్ పేర్కొన్నారు. చందమామ ప్రదక్షిణ దశ ప్రారంభానికి ముందు ఆర్టెమిస్-2 వ్యోమగాములకు శుభాకాంక్షలు చెబుతూ అపోలో-13 ఆస్ట్రోనాట్ జిమ్ లోవెల్‌కు సంబంధించిన రికార్డెడ్ సందేశాన్ని నాసా వినిపించింది. గత ఏడాది ఆగస్టులో ఆయన చనిపోవడానికి రెండు నెలల ముందు దీన్ని రికార్డు చేశారు.
విస్తృత పరిశీలనలు
చందమామను చుట్టి వచ్చే ప్రక్రియకు ఆర్టెమిస్-2కు దాదాపు 7 గంటలు పట్టింది. ఈ సందర్భంగా వ్యోమగాములు విస్తృతంగా పరిశీలనలు చేపట్టారు. తమ వద్ద ఉన్న శక్తిమంతమైన కెమెరాలు, ఐఫోన్లతో జాబిల్లి మీదున్న ఇరవైకి పైగా లక్ష్యాలను క్లిక్‌మనిపించారు. అంతరిక్ష శిలల ఢీ వల్ల ఏర్పడ్డ బిలాలు, ఇతర భౌతికాంశాలను పరిశీలించారు. ఒకే ఫ్రేమ్‌లో చందమామ, భూమిని క్లిక్‌మనిపించారు. ఇప్పటివరకూ ఫొటో తీయని ఓరియంటల్ బేసిన్ అనే బిలాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఈ బిలం వెడల్పు 965 కిలోమీటర్లు. చిన్నపాటి ఉల్కల ఢీ వల్ల చందమామపై తలెత్తిన ఆరు వెలుగులను కూడా వ్యోమగాములు పరిశీలించారు.
నామకరణం.. భావోద్వేగం..
జాబిల్లిపై కొత్తగా ఏర్పడ్డ రెండు ప్రకాశవంతమైన బిలాలకు పేర్లు పెట్టేందుకు వ్యోమగాములు నాసా అనుమతి కోరారు. ఇందులో ఒకదానికి తమ క్యాప్సూల్ పేరిట ‘ఇంటెగ్రిటీ’ అని సూచించారు. రెండో బిలానికి.. 2020లో క్యాన్సర్‌తో చనిపోయిన వైస్‌మాన్ భార్య క్యారల్ పేరును పెట్టాలని కోరారు. ఈ విజ్ఞప్తిని చేస్తున్నప్పుడు వైస్‌మాన్ కన్నీటిపర్యంతమయ్యారు. మిగతా ముగ్గురు వ్యోమగాములు చెమర్చిన కళ్లతో ఆయనను ఆలింగనం చేసుకొని ఓదార్చారు. కొద్దిసేపటికి తేరుకున్న వైస్‌మాన్ ‘‘ఇక్కడి నుంచి అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్నా’’ అని మిషన్ కంట్రోల్‌కు తెలియజేశారు. జాబిల్లిని ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ఈ యాత్రలో ఒరాయన్ వ్యోమనౌక గరిష్ఠంగా చందమామ ఉపరితలానికి 6,545 కిలోమీటర్ల చేరువకు వెళ్లింది.
ఆ సమయంలో గంటకు 5,052 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. జాబిల్లి వెనక్కి వెళ్లినప్పుడు దాదాపు 40 నిమిషాల పాటు ఒరాయన్ వ్యోమనౌకతో మిషన్ కంట్రోల్ కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. యాత్రలో భాగంగా వ్యోమగాములు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు. ఒరాయన్ వ్యోమనౌక ఈ నెల 10న పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది.ఈ యాత్రలో ఒరాయన్ వ్యోమనౌక చంద్రుని ఉపరితలానికి 6,545 కి.మీ. చేరువకు వెళ్లి, 5,052 కి.మీ. వేగంతో ప్రయాణించింది. చంద్రుని వెనుక ఉన్నప్పుడు 40 నిమిషాలపాటు మిషన్ కంట్రోల్‌తో సంబంధం తాత్కాలికంగా కోల్పోయింది. వ్యోమగాములు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు. ఒరాయన్ వ్యోమనౌక ఈ నెల 10న పసిఫిక్ మహాసముద్రంలో దిగనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















