అండమాన్ సముద్రంలో ఘోర నౌక ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో మలేసియాకు బయల్దేరిన పడవ మునిగిపోవడంతో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. చిన్నారులు కూడా ఉన్న ఈ ఘటనపై సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్, అంతర్జాతీయ వలస సంస్థ సంయుక్తంగా స్పందించాయి. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి ఏప్రిల్ 4న బయల్దేరిన ఈ పడవ, మలేసియా వైపు ప్రయాణిస్తుండగా బలమైన ఈదురుగాలులు, భారీ అలల కారణంగా మునిగినట్లు వెల్లడించాయి. అదనంగా, పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమూ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నాయి.
రోహింగ్యాలు మయన్మార్ నుంచి 2017లో జరిగిన హింసాకాండ తర్వాత బంగ్లాదేశ్‌కు తరలివెళ్లారు. కాక్స్ బజార్ శరణార్థి శిబిరాల్లో నెలకొన్న కఠిన పరిస్థితుల కారణంగా వారు మెరుగైన జీవితం కోసం ప్రమాదకర సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















