మలయాళ వెండితెరపై ప్రయోగాలకు చిరునామాగా నిలిచే మోహన్‌లాల్ మరో ఆసక్తికరమైన అవతారంలో మెరవబోతున్నారు. గతేడాది ట్యాక్సీ డ్రైవర్‌గా ‘తుడరుమ్’, ప్రేమికుడిగా ‘హృదయపూర్వం’ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ఆయన, ఇప్పుడు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘లబ్బర్ పందు’ ఫేమ్ తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘అతిమనోహరం’ అనే అందమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం బుధవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.
ఈ పోస్టర్‌లో మోహన్‌లాల్ ఖాకీ యూనిఫాంలో కనిపిస్తూనే, శబరిమల వెళ్తున్న అయ్యప్ప భక్తుల మధ్య నిలబడి ఉండటం కథపై అమితమైన ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఆయన ‘లవ్‌లాజన్’ అనే వెరైటీ పేరున్న పాత్రను పోషిస్తున్నారు. ‘తుడరుమ్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత మోహన్‌లాల్ – తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో ‘పేట్రియాట్’, అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘దృశ్యం 3’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఆ సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే, ఈ ‘అతిమనోహరం’ చిత్రంతో సరికొత్త మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు లాలేటన్. మలయాళీ పండుగ ‘విషు’ సందర్భంగా విడుదలైన ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

















