న్యూయార్క్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక మెట్ గాలాలో ప్రముఖ వ్యాపారవేత్త సుధా రెడ్డి మరోసారి రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆమె ఈసారి డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన “ట్రీ ఆఫ్ లైఫ్” గౌను ధరించారు. ఇది 3 వేల ఏళ్ల పురాతన మచిలీపట్నం కలంకారీ కళ ఆధారంగా రూపొందించబడింది. ఈ అద్భుత వస్త్ర రూపకల్పనలో సుమారు 90 మంది కళాకారులు 3,459 గంటల పాటు పనిచేశారు.
గౌనులో భాగ్యనగర వృక్ష, జంతుజాలాల రూపకల్పనలు రేషమ్ జరీతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి. వెనుక భాగంలో అమర్చిన మెటల్ వృక్ష ఆకృతి, తంగేడు పువ్వు, జమ్మిచెట్టు, సూర్యుడు, చంద్రుడు, కల్పవృక్ష చిత్రాలతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది.
ఈ సందర్భంగా సుధా రెడ్డి మాట్లాడుతూ భారతీయ, ముఖ్యంగా తెలంగాణ కళను ప్రపంచ వేదికపై పరిచయం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. గత సంవత్సరం కూడా ఆమె మెట్ గాలాలో ప్రత్యేక ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















