రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయిన సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. మే 14 నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండగా, అన్‌కట్ వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 3.52 గంటల నిడివితో ‘ధురంధర్: ది రివెంజ్’ను డిజిటల్ ప్రేక్షకులకు అందిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఇండియాలో మాత్రం జియోహాట్‌స్టార్ ద్వారా మే 15 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కథ విషయానికి వస్తే, ఆపరేషన్ ‘ధురంధర్’లో భాగంగా జస్కిరాత్ సింగ్ తన గుర్తింపును మార్చుకుని హమ్జా అలీ మజారీగా (రణ్‌వీర్ సింగ్) పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తాడు. అక్కడ ల్యారీ ప్రాంతంలోని బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా)ను హతమార్చుతాడు. ఈ ఘటనతో శక్తి సమీకరణాలు మారిపోతాయి. మరోవైపు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనను తాను కొత్త నాయకుడిగా ప్రకటించుకుంటాడు. రెహమాన్ మరణానికి బాధ్యుడైన అర్షద్‌పై ఉజెయిర్ బలోచ్ (డానిష్) ప్రతీకారం తీర్చుకోవడం కథలో కీలక మలుపుగా మారుతుంది.
ఇక హమ్జా తన వ్యూహాలతో ఉజెయిర్‌ను ల్యారీ పీఠం దక్కించుకోకుండా ఎలా అడ్డుకున్నాడు, అతనికి ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి ఎదురైన ప్రతిఘటన ఏమిటి అన్నది కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. అదే సమయంలో బడే సాబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకు మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) రూపొందించిన ఉగ్ర ప్రణాళికలను హమ్జా ఎలా అడ్డుకున్నాడన్నది ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. చివరికి హమ్జా నిజమైన ఇండియన్ గూఢచారి అని తెలిసిన తర్వాత పరిస్థితులు ఎటువంటి మలుపు తిరిగాయి అన్నదే కథలో క్లైమాక్స్.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















