రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, అంతకంటే ఒక రోజు ముందుగానే విదేశీ మార్కెట్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానుల్లో భారీ క్రేజ్ కనిపిస్తోంది.
అక్కడ టికెట్లు విడుదలైన కొద్ది గంటల్లోనే వేగంగా అమ్ముడవడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. 24 గంటలు కూడా కాకముందే లక్షకు పైగా టికెట్లు సేల్ కావడం ద్వారా నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా ఈ స్థాయి అమ్మకాలు సాధించిన సినిమాగా ‘పెద్ది’ రికార్డు సృష్టించింది . ట్రైలర్ విడుదల కాకముందే ఈ స్థాయి స్పందన రావడం సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది.
ఈ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విడుదలకు ఇంకా రోజులు ఉండటంతో, ప్రీ రిలీజ్ దశలోనే మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని, ఎడిటింగ్ కూడా ముగిసిందని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. త్వరలోనే ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం .
ఎమోషన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. “పెద్ది” పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో నుంచి తీసేయడం అంత సులభం కాదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సినిమా విడుదల కోసం అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















