సింగపూర్ తరహాలో అమరావతిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ దేశానికే మోడల్‌గా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, JISC మద్దతుతో అమరావతి ఎకనామిక్ రీజియన్‌ను అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి భాగస్వాముల కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. అమరావతికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందని ఆయన స్పష్టం చేశారు.
సింగపూర్‌లోని పుంగోల్ తరహా పట్టణ అభివృద్ధి నమూనాను అధ్యయనం చేస్తామని, అలాగే Suntec City వంటి అభివృద్ధి కేంద్రాలను పరిశీలిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల మధ్య బలమైన భాగస్వామ్యం ఏర్పడిందని ఆయన చెప్పారు.
ఎంవోయూలోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతినెలా సమీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు మంత్రులు సింగపూర్‌లో శిక్షణ తీసుకుని పరిపాలనా అనుభవాలను పంచుకున్నారని గుర్తుచేశారు.ఆంధ్రప్రదేశ్‌ను ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా మధ్య కీలక వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















