అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రతిసారీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కోసం ట్రంప్ ఒక సీక్రెట్ లెటర్ రాసి ఉంచుతారని వైట్‌హౌస్ అధికారి సెబాస్టియన్ గోర్క్ వెల్లడించారు.
ట్రంప్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రిజల్యూట్ డెస్క్‌లో వాన్స్ కోసం ఉంచే ఆ లేఖలో.. విదేశీ పర్యటన సమయంలో తనకు ఏదైనా జరిగితే దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలన్న అంశాలపై సమగ్ర సూచనలు ఉంటాయని గోర్క్ తెలిపారు.
ట్రంప్ చైనా పర్యటన సందర్భంగా విదేశీ శక్తులు ఆయనను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళనలు ఉన్నప్పటికీ.. ట్రంప్ భద్రతపై తనకు పూర్తి నమ్మకం ఉందని గోర్క్ స్పష్టం చేశారు.ఇప్పటికే ట్రంప్‌పై పలు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. 2024లో పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయనపై కాల్పులు జరిగాయి. అలాగే ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతున్న సమయంలోనూ భద్రతా సిబ్బంది ఓ దుండగుడిని అడ్డుకున్నారు. ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కూడా కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
ఇదిలాఉండగా ప్రస్తుతం ట్రంప్‌తో పాటు పలువురు కీలక అధికారులు విదేశీ పర్యటనలో ఉండటంతో వైట్‌హౌస్ బాధ్యతలను జేడీ వాన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘వైట్‌హౌస్‌లో నేను ఒంటరిగా ఉన్నట్లుంది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తన పరిస్థితిని ‘హోమ్ అలోన్’ సినిమాలోని పాత్రతో పోల్చడంతో విలేకరులు నవ్వుల్లో మునిగిపోయారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















