పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాల్లో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌పై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “సమయం మించిపోతోంది” అంటూ, తమతో త్వరగా ఒప్పందానికి రావాలని ఇరాన్‌కు సూచించారు.
కృత్రిమ మేధ (AI) సహాయంతో రూపొందించిన యుద్ధ నౌకల దృశ్యంతో కూడిన ఫొటోను ట్రూత్ సోషల్‌లో పోస్టు చేసిన ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “తుపాను వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది” అనే అర్థం వచ్చేలా ఆయన సందేశం ఉండటం గమనార్హం. ఆ చిత్రంలో అల్లకల్లోల సముద్రంలో ప్రయాణిస్తున్న యుద్ధ నౌకలు, వాటిలో ఒక దానిపై ట్రంప్‌తో పాటు అమెరికా నేవీ అడ్మిరల్ నిల్చున్న దృశ్యం కనిపించింది. ప్రత్యేకంగా ఆ నౌకలపై ఇరాన్ జెండాలు ఉండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఓ మీడియా సంస్థతో జరిగిన ముఖాముఖిలో కూడా ట్రంప్ ఇదే తరహా హెచ్చరికలు చేశారు. టెహ్రాన్ త్వరగా ఒప్పందానికి రావాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే ఒప్పందం కుదిరే అవకాశం ఉందా లేదా అన్న విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని కూడా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన చైనా పర్యటన వివరాలను ఆయనతో పంచుకున్నారు. అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో “ఇరాన్‌కు సమయం మించిపోతోంది, వారు త్వరపడాలి, లేకపోతే వారికి మిగిలేదేమీ ఉండదు” అని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై మరిన్ని దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఇద్దరు కీలక అధికారులు వెల్లడించినట్లు సమాచారం.
ఇక మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఏకైక అణు విద్యుత్ కేంద్రం ‘బరకాహ్’పై ఆదివారం డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మంటలు చెలరేగినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదని, రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అయితే దాడి వెనుక ఉన్నది ఎవరో ఇంకా స్పష్టత రాలేదు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఇంధన రవాణా కొనసాగుతోంది. 20 వేల టన్నుల ఎల్‌పీజీతో ఉన్న ఎంవీ సైమీ అనే నౌక గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు సురక్షితంగా చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ పతాకంతో ఉన్న ఈ నౌక ఖతార్ నుంచి బయలుదేరి హర్మూజ్ జలసంధిని దాటి భారత్‌కు చేరుకోవడం గమనార్హం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















